మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ కి బదిలీ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన చంద్రమోహన్ 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీస్ శాఖలో చేరారు. దేవరకొండ డిఎస్పీగా, కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పని చేశారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా పనిచేసి ఇటీవలే నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.