contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని టి.ఎస్.ఈ.ఆర్.పి జీవనజ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసం గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ ముషిపట్ల రేణుక తిరుపతి రెడ్డి హాజరై మహిళలు అన్ని రంగాలలో ముందు వుండి ఆర్థికంగా,సామాజికంగా ,విద్యా ఇతర రంగాలలో అభివృద్ధి చెందాలని,రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అన్ని రకాల సహకారం ఉంటుంది అని, వాటి ద్వారా వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పోలీస్ శాఖ ద్వారా షీ టీం ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తుంది అని తెలిపారు, పొదుపు రుణాలు తీసుకుని చెల్లించడం ద్వారా ఆర్థిక ప్రగతి నీ వారి కుటుంబాల అభివృద్ధి కి చిన్నారులకు దోహద పడుతున్నారని డిఆర్ డిఏ టి ఎస్.ఈ.ఆర్.పి ఐకెపి నుండి పూర్తి సహకారం అందుతుంది అని ,ఈ కార్యక్రమలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు, ఈ కార్యక్రమంలో యుబీఐ వీణవంక మేనేజర్,ఫీల్డ్ ఆఫీసర్ హాజరై మాట్లాడుతూ మండలం లో బ్యాంక్ లింకేజీ ప్రగతి బాగుందని రేపేమెంట్ కూడా కొన్ని గ్రూప్ లు మినహా చాలా గ్రూప్ ల ప్రగతి బాగుందని తెలిపారు, డిఆర్డిఏ నుండి డిపిఎం (బ్యాంక్ లింకేజ్) రమణ హాజరై మాట్లాడుతూ బ్యాంక్ లింకెజీ తో మహిళలు ఆర్థికంగా బాగు పడుతున్నారు, ఈ ఆర్థిక సంవత్సరం లో 695 సంఘాలు 44 కోట్ల 96 లక్షల 36 వేల రుణాలు తీసుకున్నారని,వారి కుటుంబానికి ,వారి పిల్లల చదువులకు, పెళ్ళిలకు, విదేశాలకు వెళ్ళడానికి ఉపయోగించుకుంటూ ప్రగతి సదిస్తునారని తెలిపారు. ప్రభుత్వము  డిఆర్ డిఏ టి ఎస్.ఈ.ఆర్.పి ఐకెపి ద్వారా వివిధ కార్యక్రమాలలో పథకాలలో ఇచే శిక్షణ లని ఉపయోగించుకోవాలని అన్నారు, అనంతరం ఎస్ఈఈపి ప్రోగ్రాం ద్వారా ఓటింగ్ శాతం పెరిగే విధంగా మీరు అందరు కృషి చేయాలని, ఎంపీపీ తెలిపారు, మరియు ఈ కార్యక్రమానికి (ఎస్ విఈఈపి )ఉద్దేశించి ఏర్పాటు చేసిన రంగవల్లి, మెహిందీ పోటీలలో ఏర్పాటు చేసి విజేతలు ముగ్గుల పోటీల్లో మొదటి బహుమతి సరోజన చల్లుర్ రెండవ బహుమతి కావ్య కిష్టంపేట, మూడవ బహుమతి ప్రియాంక కొండపాక, మరియు మెహిందీ పోటీలలో మొదటి బహుమతి మౌనిక హిమ్మత్ నగర్ రెండో బహుమతి అపర్ణ చల్లుర్, మూడో బహుమతి శ్రీవాణి లకు అందచేశారు. అనంతరం ఎంపీపీ కి ఐకేపీ అధికారులు, మండల సమాఖ్య పాలక వర్గం సన్మానం చేశారు, మరియు మండల లోని ఐదు క్లస్టర్ లకు బెస్ట్ విఓ, బెస్ట్ విఓఏ లకు సన్మానం చేశారు.బెస్ట్ వివో నేటిభారతి ఇప్పలపాల్లి, లక్ష్మి వల్బాపూర్,సాయి బాబా కొండపాక,సరస్వతి బ్రహ్మనపల్లి,వేమన బొంతుపాల్లి,బెస్ట్ విఓఏ సరోజన మల్లన్నపల్లి స్వరూప ఇప్పలపల్లి, రజిత లమకక్కపల్లి,సంధ్య బేతిగల్, పద్మ రెడ్డిపల్లి లకు ఎంపీపీ, మండల సమాఖ్య అధ్వర్యంలో లో సన్మానం చేశారు.  బ్యాంక్ మేనేజర్,ఫీల్డ్ ఆఫీసర్, ఏపిఎం కొమరయ్య,,సీసీ లు ఆనంద్ , ఘణశ్యామ్, తిరుపతి, శ్రీకాంత్,పద్మ లకు మరియు డిఎంజి తిరుపతి, స్తీనిధి మేనేజర్ అనిల్ లకు విఓఏ లు అందరు కలిసి సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల వివో ప్రెసిడెంట్ లు, మండల సమాఖ్య సిబ్బంది కవిత, కృష్ణవేణి,చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :