పల్నాడు జిల్లా కారంపూడి : మహిమా జీసస్ మినిస్ట్రీస్ వారి సిలువ సువార్త ఉజ్జీవ పండుగ సభలు కారంపూడి పట్టణంలో ఘనంగా ముగిశాయి. పట్నంలోని సాయి కృష్ణ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు ఏప్రిల్ 2,3 తేదీలలో సిలువ సువార్త ఉజ్జీవ పండుగలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంవస్థ వ్యవస్థాపకులు డాక్టర్ జి.మహిమకుమారి పాల్గొన్నారు. పాస్టర్ రెవ. కే బాపనయ్య నిర్వహణలో, ఏ.ఈ.ఎల్.సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అధ్యక్షతన ఈ సువార్త కూడికలు ఘనంగా జరిగాయి. ఈ కూడికల్లో ముఖ్య ప్రసంగీకులుగా రెవరెండ్ గోన జోసెఫ్( బాప్టిస్ట్ చర్చ్ కారంపూడి), పాస్టర్ కట్టమూరు జాన్ మోజేష్ (బాప్టిస్ట్ చర్చ్ నల్గొండ), పాస్టర్ జింక శ్రీనివాస్ రావు (గుంటూరు), పాస్టర్ ఎం విజయకుమార్( గుంటూరు) పాల్గొన్నారు. ఈ సువార్త కూడికలో స్థానిక సంఘ పెద్దలు, స్త్రీలు, సండే స్కూల్ బాలబాలికలు మరియు గుంటూరు మహిమ జీసస్ మినిస్ట్రీస్ సంఘస్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికీ , కారంపూడి పంచాయతీ వారికి అధికారులకు సంఘం తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.