భావిభారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నెల కొల్పుతున్న కళాశాలలో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరుపుతూ విద్యా ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారు.
స్థానిక మైదుకూరు లోని వనిపెంట రోడ్డులో ఉన్న బాలశివ యోగేంద్ర మహారాజ్ డిగ్రీ కళాశాలలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ డిగ్రీ మరియు పీజీ పరీక్షలలో విచ్చలవిడిగా మాస్ కాపీయింగ్ జరుపుతూ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
యూనివర్సిటీ నుంచి వచ్చిన అబ్జర్వరే మాస్ కాపీయింగ్ సజావుగా జరిగేట్లు సహకరిస్తున్నారు.
పుట్టగొడుగుల్లాగా పుట్టుకోస్తున్న ఉర్దూ ఓపెన్ యూనివర్సిటీల లో మాస్ కాపీయింగ్ జరిపిస్తూ అడ్డదారులలో పాస్ చేపిస్తామని విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉర్దూ యూనివర్సిటీలు
కేవలం కాపీలు జరిపించడానికి ఒక్కో విద్యార్థి నుండి మూడువేల నుండి 5000 వసూలు చేస్తున్న యూనివర్సిటీ కోఆర్డినేటర్లు
ఇన్విజిలేటర్లు కూడా లేకుండా పరీక్షలను నిర్వహిస్తున్న బాల శివ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం
ప్రశ్నించిన మీడియాను కూడా కొనడానికి ప్రయత్నించిన కోఆర్డినేటర్లు