తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం చేస్తున్నారని, ఆయన అంతుచూసే వరకు వదలబోనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావును అడ్రస్ లేకుండా చేస్తానని హెచ్చరించారు. తన కుమారుడికి మెదక్ టికెట్ ఇస్తేనే.. తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.