పల్నాడు జిల్లా: జనపాడు లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపడు చెరువు, పొలాలలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి తరలింపు జోరుగా సాగుతుంది .. పగలు, రాత్రులు తేడా లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికారులకు రిపోర్టర్లు సమాచారం ఇస్తే, అక్రమాలకు పలుపాడేవారిని బ్రతిమిలాడి అక్కడినుండి పంపుతున్నారే తప్పా వాహనాలు సీజ్ చేసి, వారిపై చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాక మట్టి మాఫియాకు మద్దతుగా నిలబడుతూ జర్నలిస్టుల దాడులకు కారణమంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు