మెదక్ జిల్లా : 2017 లో రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో శ్రీ రాధా కిషన్ ఇన్స్పెక్టర్ సమాచారం మేరకు దాడులు నిర్వహించి కుంట సిద్దయ్య తండ్రి గండయ్య గ్రామం లక్ష్మాపూర్ రామాయంపేట మండలం 410 గ్రాముల ఎండు గంజాయి మరియు ఐదు గంజాయి మొక్కలను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులో 28- 8 -2023 సోమవారం రోజున 1ఎస్టీ ఏ డీజే కోర్టు మెదక్ మెజిస్ట్రేట్ అయినటువంటి లక్ష్మీ శారద వెలువరించిన తీర్పులో కుంట సిద్దయ్య తండ్రి గండయ్య కి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 25 వేల రూపాయలు జరిమానా విధించడం జరిగిందని, ముద్దాయిని సంగారెడ్డి జైలుకు తరలించడం జరిగిందని రామాయంపేట ఎక్సైజ్ ఎస్సై శ్రీ విజయ్ సిద్ధార్థ తెలిపారు.