కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట గ్రామ శ్రీ మానస దేవి ఆలయ కమిటీ సభ్యులకు కొత్తపెళ్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన రవ్వనేని కనకయ్య 1.01.116 రూపాయలను బుధవారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు బద్దం నరసింహారెడ్డి, చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయి శర్మ భక్తులు పాల్గొన్నారు.