contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: జడ్.పి.హెచ్.ఎస్ జంగపల్లి క్రీడా మైదానంలో గన్నేరువరం మండలస్థాయి క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపిక పోటీ లను ప్రధానోపాధ్యాయురాలు ఎస్.సుమలత ప్రారంభించారు. మండల స్థాయిలో రాణించిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారని కన్వీనర్ బాబు శ్రీనివాస్ పిడి తెలిపారు. ఈ ఎంపిక పోటీలలో మండలంలోని గన్నేరువరం, జంగాపల్లి, హన్మజీపల్లె, ఖాసీంపేట, గ్రామాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పి రాజబాబు ,అశోక్ ,జ్యోతి మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :