ఎన్టీఆర్ జిల్లా – మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బంది నిర్వాకం చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏకంగా ప్రభుత్వ ఆఫీసులను బార్ ని చేసారు. ఆఫీస్ గదిలో మందు పార్టీ చేసుకుంటూ రిపోర్టర్ కెమెరాకు చిక్కారు. మార్కెట్ యార్డ్ అసిస్టెంట్ లు పీర్ సాహెబ్(చంటి), నాగరాజు లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మందు బాబుల పై చర్యలుతీసుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నారు.