కరీంనగర్ జిల్లా: మానేరు డ్యామ్ పై బ్రిడ్జి కోసం ఈ నెల 10న గన్నేరువరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద చేపట్టనున్ననిరాహార దీక్షకు గన్నేరువరం బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని.. బ్రిడ్జి సాధన కమిటీ నాయకుడు సంపతి ఉదయ్ కుమార్ ,పుల్లెల రాములు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో గన్నేరువరం మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మానేరు డ్యాం నుండి మండల కేంద్రానికి బ్రిడ్జి నిర్మాణం చేపడతానని ఎంపీ బండి సంజయ్ హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీని నెరవేర్చాలని ఎన్ని సార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదని, గన్నేరువరం మండలానికి సరైన రోడ్డు మార్గం లేక ప్రజల అవస్థలు పడుతున్నారన్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. బ్రిడ్జి కొరకు వివిధ గ్రామాల ప్రజలతో ఆదివారం గన్నేరువరం తాసిల్దారు కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేపట్టేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో పుల్లెల రాములు,పుల్లెల జగన్,మంగరాపు రవి, బుర్ర పోచమల్లు,కాంతాల కృష్ణారెడ్డి, కాల్వ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.