కారో, బైకో ఏదైతేనేం.. అప్పుడప్పుడూ తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం. ఒక్కోసారి వెతికివెతికి చిరాకు కూడా వేస్తుంటుంది. మరి ఈ తంటా ఎందుకు అనుకున్నాడో ఏమో అమెరికాకు చెందిన యూట్యూబర్ బ్రాండన్ దలాలీ చిత్రమైన పని చేశాడు. తన చేతికి ఆపరేషన్ చేయించుకుని కారు తాళం పెట్టించేసుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.
ఎలక్ట్రానిక్ కీ అవడంతో..
- బ్రాండన్ వాడేది టెస్లాకు చెందిన ఆధునిక ఎలక్ట్రిక్ కారు. దానికి ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ కీ ఉంటుంది. దాన్ని ఇన్ సర్ట్ చేయాల్సిన పని ఉండదు. కేవలం కారు డోర్ వద్ద ట్యాప్ చేస్తే అన్ లాక్ అవుతుంది.
- కారు లోపల కూడా ఆ కీని ఉపయోగించే స్టార్ట్ చేయడం, ఇతర పనులు చేయడం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే బ్రాండన్ సదరు ఎలక్ట్రానిక్ కీని తన కుడి చేతి మణికట్టు పై భాగంలో చిన్న ఆపరేషన్ చేయించుకుని ఫిట్ చేయించేసుకున్నాడు.
- ఇందుకోసం సదరు వైద్య నిపుణుడికి 400 డాలర్లు (మన కరెన్సీలో రూ.32 వేలు) చెల్లించాడు.
- కారు దగ్గరికి వెళ్లిన బ్రాండన్ కేవలం తన చేతి మణికట్టును డోర్ కు దగ్గరగా అటూ ఇటూ కదిలిస్తే అన్ లాక్ అయిపోయింది.
- కారు లోపల కూడా సెన్సర్లు ఉన్న భాగంలో తన చేతిని పెట్టగానే స్టార్ట్ అవడం, ఆఫ్ అయిపోవడం, ఇతర పనులు చేయడం జరిగిపోయింది.
- బ్రాండన్ ఇలా చిప్ ఆధారిత లాకింగ్ సిస్టమ్ లు పెట్టించుకోవడం ఇదే తొలిసారి కాదట. తన ఇంటి మెయిన్ డోర్ లాక్ తన ఎడమ చేయిలో ఉంటుందని బ్రాండన్ చెబుతున్నాడు.
Finally decided to take my phone key issues in to my own hands… literally. Tesla key chip implant. pic.twitter.com/RVK8ZaePoI
— Brandon Dalaly (@BrandonDalaly) August 16, 2022