- బహుజన హక్కుల పోరాట సమితి ఆంధ్ర ప్రదేశ్
- బి హెచ్ పి ఎస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యోహాన్ జొన్నలగడ్డ
మణిపూర్ లో ఇటీవల కాలంలో మహిళల పైన జరుగుతున్న హత్యలు అరాచకాలు నగ్న ఊరేగింపు ఎన్నో హింసాత్మిక ఘటనలను ఖండిస్తూ ఈరోజు పిడుగురాళ్ల పట్టణ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల సమూహంతో నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన బి హెచ్ పి ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు యోహాన్ జొన్నలగడ్డ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వల్లనే దేశవ్యాప్తంగా ఎన్నో హత్యలు మానభంగాలు యువకులపై హత్యలు హింసించి ఆపై మూత్ర విసర్జన చేయటం మహిళలను నగ్నంగా ఊరేగింపు గ్రామ బహిష్కరణ వంటి నీచమైన కార్యకలాపాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ని ప్రతిష్టంగా అమలు చేయలేని కేంద్ర రాష్ట్ర హోం శాఖ అధికారులు కేంద్ర హోం మంత్రి హమీర్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత నైతిక బాధ్యత వహిస్తూ వారి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎం సిపిఐ ఎంఐఎం పార్టీ సిపిఐ బి హెచ్ పి ఎస్ మైనారిటీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.