- మూడవ రైల్వే లైన్ కింద ఉన్న అంతర్ బ్రిడ్జి వద్ద ఉన్న నీరు వెంటనే తొలగించి అటు వాహనదారులకు, గ్రామాలకు వెళ్లే ప్రజలకు రహదారి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించాలి: సిపిఎం పార్టీ కొమరాడ మండల కమిటీ డిమాండ్.
పార్వతిపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం: పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, ఉలిపిరి పంచాయతీ సరుడు గూడ గ్రామానికి వెళ్లే రైల్వే లైన్ కింద ఉన్న అంతర్ బ్రిడ్జి వద్ద ఉన్న నీరుని తొలగించి అటు గ్రామాలకు వెళ్లే ప్రజలకు మరియు ఇటు టు వీలర్ వాహనదారులకు నీళ్లు లేకుండా రహదారి సౌకర్యం పూర్తి కల్పించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి సరుగుడు గూడ గ్రామానికి వెళ్లే రైల్వే లైను బ్రిడ్జి వద్ద ఉన్న నీరు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ… కొమరాడ మండలానికి సంబంధించి గుమడ రైల్వే స్టేషన్ సమీపంలో నయా మరియు చిన్నకర్గల్ పంచాయితీకి వెళ్లే గ్రామాల ప్రజలకు మరియు ఉ లిపిరి పంచాయతీ సరుగుడు గూడ కూడా గ్రామాల తో పాటు మిగతా గ్రామాలకు వెళ్లే రైల్వే లైన్ అంతర బ్రిడ్జి కింద అతి చిన్న వర్షానికి కూడా నీరు ఎక్కువ నిల్వ ఉండడంతో ఆ బ్రిడ్జి కింద నుండి వాన దారులు మరియు ఆయా గ్రామాలకు వెళ్లే గిరిజన ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని బ్రిడ్జి కింద నీరు నిలవడంతో గిరిజనులు ఆ రెండు బ్రిడ్జిలు కింద వెళ్ళడంతో ప్రతిరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అలాగే ఆయా గ్రామాల ప్రజలు నిత్యావసర వస్తువులను కూడా తీసుకుని వెళ్లడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో అనేక ఇబ్బందులకు గిరిజనులు గురవుతుంటే కనీసం రైల్వే కాంట్రాక్టు గాని రైల్వే అధికారులు కానీ పూర్తిస్థాయిలో నీరు ఈ అంతర్ బ్రిడ్జి కింద నిలవ లేకుండా చేయని పరిస్థితి ఉందని కావున వెంటనే గుమడ రైల్వే స్టేషన్ సమీపంలోనూ మరియు సరుగుడు గూడ గ్రామ సమీపంలో ఉన్న ఈ రైల్వే అంతర్ బ్రిడ్జి వద్ద ఉన్న నీరుని పూర్తి స్థాయిలో తొలగించి అటు గిరిజన ప్రజలకు ఇటు వాహానదారులకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నామని, ఈ విషయం పైన త్వరలో పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ కి కూడా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయుచున్నామన్నారు, సరుగుడు గూడ అంతర్ బ్రిడ్జి వద్ద నిల్వ ఉన్న నీటి వద్ద నుండి మాట్లాడుతున్న నాయకులు,అలాగే బ్రిడ్జి కింద నుండి వెళుతున్న వాహనాలు యొక్క వీడియోలు నీరు నిల్వ ఉన్న ఫోటో వీడియో చూడగలరు అని తెలిపారు.