మన్యం జిల్లా, కొమరాడ మండలం పూర్ణపాడు లోని లాబేసు వంతెన వద్ద ఈ రోజు సిపిఎం నేతలు వినూత్న నిరసన చేపట్టారు. వంతెన పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, వారు తమ మెడకు ఉరితాళ్లు బిగించుకొని ఆందోళన తెలిపారు. “పనులు ప్రారంభించకపోతే, మాకు ఉరివేసి నాగవళి నదిలోనే పడేయండి” అంటూ వారి ఆవేదనను వ్యక్తం చేశారు.
వంతెన పనులపట్ల గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హైలైట్ చేస్తూ, వారు ఈ నిరసన చేపట్టారు. గిరిజన ప్రాంతాలకు మరియు 45 గిరిజన గ్రామాలకు ఈ వంతెన అత్యంత ప్రాధాన్యం కలిగినది. అయితే, ఈ వంతెన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ వంతెన పనులు త్వరగా పూర్తయ్యేలా చేస్తామని హామీ ఇచ్చినా, ఆరు నెలలు గడిచినా వంతెన వద్దకు ఏ అధికారి లేదా కాంట్రాక్టర్ కూడా రాలేదని నేతలు పేర్కొన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేయడం అన్యాయం అని పేర్కొన్నారు.