పార్వతిపురం మన్యం జిల్లా, కొమరాడ, ది రిపోర్టర్ :పార్వతీపురం రోడ్లు భవనాల శాఖ జేఈ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో సోమవారం కొమరాడ మండల కేంద్రంలోని అంతరాష్ట్ర రహదారి మార్గంలో గల ఈశ్వరాలయం వద్ద బంగారం పేట వద్ద పెద్దపెద్ద గోతులు పూడ్చి వేయడం జరిగింది.గోతులు తూతూ మంత్రంగా కాకుండా శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా ఈ రోడ్డులో ఉన్న గోతులన్నీ కప్పి అటు వాన దారులు ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ… ఆదివారం కొమరాడ మండల కేంద్రానికి అతి సమీపంలో పార్వతీపురం నుండి కునేరు వెళ్లే అంతరాష్ట్ర రహదారి పైన ఈశ్వరాల వద్ద పెద్ద గొయ్యిలో నీరు నిలవడంతో ఆ నీటిలో ఆదివారం ఈత కొడుతూ నాట్లు వేస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని ఇలాంటి సందర్భంలో ఈరోజు అనగా సోమవారం రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి వచ్చి ఈ గోతులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ జెసిపి తో పూడ్చి వేయడం జరిగిందని ఇలాంటి సందర్భంలో ఇలా తూతూ మంత్రంగా కాకుండా పూర్తిస్థాయిలో ఈ అంత రాష్ట్ర రహదారి మార్గంలో గల రోడ్డు పనులు చేపట్టి అటు వాహనదారుల ఇటు ప్రయాణికులు ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం ఏదేమైనా రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించడం రోడ్డు మీద ఉన్న పెద్ద గోతులు కప్పడం శుభ పరిణామం అని చెప్పుతూ ఇలా తాత్కాలికంగా కాకుండా పూర్తిస్థాయిలో పార్వతీపురం నుండి కు నేరు వరకు వెళ్లే అంతరాష్ట్ర రహదారి మార్గంలో ఉన్న గోతులన్నీ కప్పి ఆటో ఒరిస్సా తో పాటు మూడు రాష్ట్రాలకు వెళ్లే వాహన దారులు మరియు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నామన్నారు.