ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. ఇప్పటి వరకు 36 మంది మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. కమలేశ్ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందినవారు. ఊర్మిళది బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంగా తెలుస్తోంది.
మరోవైపు ఈ భారీ ఎన్ కౌంటర్ పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. మృతుల ఫొటోలు, వివరాలను పోలీసులు వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది.