మాసాయిపేట తూప్రాన్ : ఈ నెల 10 నుండి 12 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సి.ఏం కప్ 2024 మండల స్థాయి క్రీడలు నేటితో విజయవంతంగా ముగిశాయి.
ముగింపు సమావేశంలో మాసాయిపేట మండల తహసీల్దార్ జ్ఞాన జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని, విజేతలకు బహుమతులు అందజేశారు.
మండల కేంద్రంలో ఈ క్రీడలు అత్యద్భుతంగా నిర్వహించబడాయని మాసాయిపేట మండల ఇన్చార్జి అభివృద్ధి అధికారి ఉమా దేవి తెలిపారు. అట్లాంటి కార్యక్రమాలకు మాసాయిపేట వేదిక కావాలని ఆయన అన్నారు.
క్రీడల ముగింపు సభ ఉమా దేవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాసాయిపేట మండల రెవెన్యూ అధికారి లీలావతి, తాజా మాజీ ఎంపిటి శ్రీ కృష్ణ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాసాయిపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధర్మ పురి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడల ఫలితాలు:
- కబడ్డీ పురుషుల విభాగం:
- ప్రథమ స్థానం: రామంతాపూర్ గ్రామ జట్టు
- ద్వితీయ స్థానం: అచ్చంపేట గ్రామ జట్టు
- ఖో-ఖో పురుషుల విభాగం:
- ప్రథమ స్థానం: రామంతాపూర్ తండ జట్టు
- ద్వితీయ స్థానం: మాసాయిపేట గ్రామ జట్టు
- వాలీబాల్ విభాగం:
- ప్రథమ స్థానం: రామంతాపూర్ తండ జట్టు
- ద్వితీయ స్థానం: రామంతాపూర్ గ్రామ జట్టు
- మహిళల కబడ్డీ, ఖో-ఖో విభాగం:
- ప్రథమ స్థానం: మాసాయిపేట జట్టు
- ద్వితీయ స్థానం: రామంతాపూర్-నాసాన్పల్లి జట్టు