ప్రకాశం జిల్లా : త్రిపురాంతకం మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి మండల కార్యదర్శి బాణాల రామయ్య అధ్యక్షత వహించారు.ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దెవండ్ల శ్రీనివాస్ ముందుగా సిపిఐ కార్యాలయంలో మేడే జెండాను ఆవిష్కరించారు. తరువాత యన్ ఏఎస్ పి ఉద్యోగుల జెండాను అనంతరం బస్టాండ్ వద్దగల ఏ ఐ టి యు సి జెండాను ఎగుర వేశారు.ఈసందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మికులు, ఉద్యోగులు, తమ హక్కుల పరిరక్షణ దినంగా మే డే ను జరుపుకుంటారని అన్నారు. కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా కార్మికులంతా ఐక్యంగా జరుపుకుంటారని అన్నారు. 1886 మే ఒకటో తేదీన అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో 8 గంటల పని జనాల కొరకు లక్షల మంది కార్మికులు, నిర్వహించిన ప్రదర్శనను ప్రభుత్వం పరిశ్రమల యజమానులకు చెందిన పోలీసులు, జరిపిన కాల్పుల్లో అనేక మందికి గాయాలు కాగా పలువురు మరణించారని తెలిపారు. ఈ సంఘటన వల్ల చలించిన కార్మికుల చేతుల రక్తంతో తడిచిన గుడ్డను కార్మికుల జెండా గా రూపొందించడం జరిగిందన్నారు. ఆనాటి నుండి ఎర్రజెండా కార్మిక పోరాట జెండా గా మారిందని అన్నారు. ఈ పోరాట స్ఫూర్తితో అనేక దేశాలలో కార్మికులు చట్టాలను సాధించుకున్నారని అన్నారు. మనదేశంలో 1920 అక్టోబర్ 31 తేదీన ముంబాయిలో అఖిల భారత కార్మిక సంఘం ఏర్పడిందని అన్నారు. ఇప్పుడు కార్మికులంతా ఏకమై ఒక మాటమీద నిలబడి తమకు రావలసిన హక్కులు పుపొందాలని వారు అన్నారు.ఏకం కండి ఏకం కండి కార్మికులారా ఏకం కండని నినాదాలు చేశారు.అనంతరం సీపీఐ మహిళా నాయకురాలు లక్ష్మి రాజ్యం జన్మదిన వేడుకలు,మేడే పండుగ పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నరు.అనంతరం మెడపీ,గొలపల్లి తదితర గ్రామాలలో కూడా జండా వందన కార్యక్రమం చేశారు. ఈకార్యక్రమాలలో పట్టణ కార్యదర్శి కాసీం, లక్ష్మీరాజ్యం, తిరుమలయ్య, ఎన్నేస్పి నాయకులు శ్రీనివాస్, శ్రీను, సత్ర్యనారయన,టైలర్ వర్కర్స యూనియన్ నాయకులు కోటీ,వెంకటరావు,శ్రీను ఎజ్రా శాస్త్రి, సీనియర్ నాయకులు అభిమానులు కార్యాకర్తలు పాల్గొన్నారు.
