పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గంలో పర్యటించిన నూతన ఎస్పీ మల్లికా గార్గ్, వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఘర్షణలు జరగకుండా మాచర్ల నియోజకవర్గం లోని వెల్దుర్తి ,రెంటచింతల, కారంపూడి, దుర్గి మాచర్లలో, ప్రతి ఫ్యాక్షన్ గ్రామాలలో ఇప్పటికీ ఫ్యాక్షన్ తగాదాన్ని నిరుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆయా మండలాల్లో మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉంది, సమయం కూడా చాలా తక్కువ ఉన్నందున అన్ని గ్రామాలను జల్లెడ పడతాము, అనుమానితులు కూడా విచారిస్తాము, కార్డెన్ సర్చ్ నిర్వహించి క్షుణ్ణంగా పరిశీలిస్తాము, కాబట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని ప్రతి ఒక్కరు లా అండ్ ఆర్డర్స్ కు సహకరించాలి అని వారు పేర్కొన్నారు, దీని దృష్ట్యా మాచర్లలోని ముందస్తు చర్యలో భాగంగా పట్టణంలోని అన్ని షాపులను పోలీసులు మూసి వేయించడం జరిగింది..
