మాచర్ల పట్టణ పరిధిలో 9వ వార్డులో పెన్షన్ రూ. 7, 000కు బదులు రూ. 6, 500 ఇచ్చిన సంఘటనలో సోమవారం లబ్ధిదారుల ఫిర్యాదు మేరకు వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు నాయక్ ను విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ వెంకట దాసు పేర్కొన్నారు. ఎవరైనా ఉద్యోగస్తులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.