పల్నాడు జిల్లా / మాచర్ల : బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుండి విముక్తి కల్పించేందుకు అనేకమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారని వారి పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురువేసి వందనం సమర్పించారు. తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మహనీయులకు నివాళులు అర్పించారు మండల పరిషత్ కార్యాలయంలో, పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కౌన్సిలర్లతో కలిసి జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. బాలికోనత పాఠశాలలో నిర్వహించిన వేడుకలలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని ఈ దశలోనే విద్యార్థులు మంచి చెడులను గ్రహించి ఉన్నత శిఖరాలను అధిరోహించి మన గ్రామానికి మన రాష్ట్రానికి దేశానికి కీర్తి ప్రతిష్టలు పెంపొందించేలా ఉండాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటపటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ధర్మ కోసం న్యాయం కోసం నిలబడాలన్నారు అనంతరం 8 9 10 తరగతిలో గత ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.