దళిత మైనర్ బాలిక Sc (మాదిగ) పై అత్యాచారం చేసి అబార్షన్ చేయించిన కీచక గురువు యద్దనపూడి శ్రీనివాసరావు ను కఠినంగా శిక్షించి బాథిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం “11. గం”లకు మాచర్ల ఎం సి పి ఐ కార్యాలయము నందు దళిత మైనర్ బాలిక న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ పోలేపల్లి అబ్రహం లింకన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ అభం శుభం ఎరుగని దళిత మైనర్ బాలిక (15) గిరిజన ఆశ్రమ పాఠశాల నందు పదో తరగతి చదువుతుండగా మాయ మాటలు చెప్పి బెదిరించి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేసి అబార్షన్ చేయించిన కామపిశాచి, దుర్మార్గుడు యద్దనపూడి శ్రీనివాసరావు(57) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ , బ్రూణ హత్యా నేరం కేసు నమోదు కొరకు గత 7 నెలలుగా బాధిత కుటుంబం వివిధ హక్కుల సంఘాల నాయకులు రాజీలేని పోరాటం చేస్తున్నప్పటికీ వారికి న్యాయం చేయవలసిన బాధ్యత గల ప్రభుత్వ అధికారులే ముద్దాయి కాసులకు అమ్ముడుపోయి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అటువంటి బాధ్యత రాహిత్య నిర్లక్ష్యపు ధోరణితో ఉన్న అధికారుల వైఖరికి నిరసనగా మరొకసారి దళిత మైనర్ బాలిక న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు మాచర్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలు ,ప్రజాస్వామిక వాదులు, వామపక్ష పార్టీలు, విద్యార్థి, మహిళా,హక్కుల, కుల సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతరం ముద్దాయికి కొమ్ము కాస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్న అధికారుల వైఖరిని ఖండిస్తూ కరపత్రం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. డాక్టర్ రామచంద్రారెడ్డి, మహిళా సంఘం నాయకులు ద్వాలి, కుమారి, ఎమ్మార్పీఎస్. రూబేను, దానియేలు,సిపిఐ నాయకులు. బాబురావు,సిపిఎం నాయకులు. మహేష్, ఎం సి పి ఐ.నాయకులు నాగరాజు,సిఐటియు. శోభన్ కుమార్,కార్మిక సంఘం. రాము, చంద్రం, రామదాసు, తదితరులు పాల్గొన్నారు.