- భూదాన్, సీలింగ్ చట్టం ప్రకారం పట్టా సర్టిఫికెట్లు పొందిన వారికే భూములు ఇవ్వాలని సి.పిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం
మెదక్ జిల్లా : భూదాన్, సీలింగ్ చట్టం ప్రకారం పట్టా సర్టిఫికెట్లు పొందిన వారికే భూములు ఇవ్వాలని సి.పిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేసారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామం లో 2004లో భూదాన్ చట్టం ప్రకారం 266/1 సర్వే నంబర్ లో మొత్తం భూమి 755 ఎకరాల భూమిని గ్రామంలోని కొంతమంది మంది పేద రైతులకు సిలింగ్ యాక్ట్ ప్రకారం 1974, 1993 సమత్సరాలలో పట్టాలిచ్చారు. ఆ తరువాత 2004 సమత్సరంలో భూ దానం చట్టం ప్రకారం మరికొంద మంది రైతులకు పట్టాలిచ్చారు.
పట్టాలిచ్చిన తరువాత రైతులు పొజిషన్ లోకి వెళితే దేశముఖ్ దొరలు ఆ భూమి మాదంటూ కోర్టు స్టెతస్కో తీసుకురావడం జరిగింది. అప్పటి కలెక్టర్ రైతులకు అనుకూల తో కోర్టు కు వివరాలు సమర్పించారన్నారు. గత పది సమత్సరాలుగా కోర్టు కేసు కొనసాగుతున్నప్పటికీ, ఎండోమెంట్ వారు ఆ భూమినంతా ఇబ్రహీంపూర్ గ్రామంలో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు రైతులకు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి పట్టాలించ్చిన రైతులకు న్యాయం చేయాలనీ సిపియం పార్టీ నాయకులూ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మల్లేశం, ఈద రాజు, ఏం.నర్సింలు, జి.పర్శరాములు, సి.ఎచ్ ఏళ్ళం, కే.మల్లయ్య, ఏ.ఎల్లం, కే.భూషణం, కే.స్వామి, పి.స్వామి, ఏం శ్రీను, వై సత్తయ్య , కె.మల్లేశం, మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.