మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు, సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలు, ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంగల్పర్తి గ్రామపంచాయతీ కార్మికులతో పాటు పలువు కార్మికులు నాయకులు పాల్గొన్నారు.