- చలో కొంతాన్ పల్లి
- అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి…..
- ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ వెల్లడి
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించితక్షణమే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళితుల ఎదుగుదల చూసి ఓర్వలేని దుండగులు మహానీయున విగ్రహం ధ్వంసం చేయడమంటే దళితుల మనోధైర్యాన్ని దెబ్బ తీయడమేనన్నారు. దళితులతో పాటు అన్ని వర్గాలకు హక్కులు కల్పించి, ఈ దేశపరిపాలనకు దశదిశ నిర్దేశించిన మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ అన్నారు. కొంతాన్ పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎంతటి వారైన వదిలిపెట్టొద్దన్నారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానానికి సభ్యసమాజం సిగ్గు పడుతుందన్నారు. రేపు ఉదయమే అన్ని దళిత, గిరిజన ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో కొంతాన్ పల్లి గ్రామానికి తరలి రావాలని, దళితుల ఆత్మగౌరవాన్ని చాటుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు