మదనపల్లి :స్థానిక స్థానిక ఎస్టేట్ దగ్గర బాలాజీ నగర్ లో ఉన్నటువంటి మెకానిక్ రమేష్ సొంత లాభం కొంత మానుకుని తోటి వారికి తోడ్పడవోయ్ అనే సూక్తిని అక్షరాల పాటిస్తూ … సమాజసేవ కోసం తన వంతు కృషి తను చేస్తూ వస్తున్నారని వి ఎస్ బాబు అన్నారు . సోమవారం చైతన్య అనాధాశ్రమంలోని ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకు 3400 రూపాయల విలువచేసే నాలుగు జతల యూనిఫాంలు తీసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ జి వి ఎస్ బాబు మరియు జనరల్ సెక్రెటరీ కవితా రాణిలు మాట్లాడుతూ మెకానిక్ రమేష్ ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన తమ సంస్థలోని పిల్లలతో కలిసి జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రమేష్ కు మరియు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.