- టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేష్ డిమాండ్…
- మదనపల్లి పుంగనూరు రోడ్డులో, హార్సిలీ హిల్స్ కింద 60 ఎకరాలు ఆర్డీఓ మురళి స్వాహా…
అన్నమయ్య జిల్లా , మదనపల్లె పుంగనూరు రోడ్డులో డికెటి స్థలంలో మాజీ ఆర్డీఓ మురళి సహకారంతో ఓ పెట్రోల్ బంకు ఓనర్ తోకలిసి మూడున్నర ఎకరాల భూమిలో ఫ్లాట్లు వేసి అమ్మకం, మరో ఒకటిన్నర ఎకరా బినామి పేర్లుతో స్వాహా చేసాడని, ఆర్డీఓ మరళి పర్యాటక కేంద్రం అయిన హార్సిలీ హిల్స్ లో గెస్ట్ హౌస్, మురళి అల్లుడు హార్సిలీ హిల్స్ కింద 60 ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పొందడం పైన విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జే.వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం నిమ్మనపల్లె సర్కిల్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం పత్రాల దహనం పైన సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పెద్ద ఎత్తున 22 ఎ ఫైల్స్ దహనం జరిగిందనే వాస్తవాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దీనికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులే కారణమని ఆరోపణలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో ప్రభుత్వ భూములు గుర్తించి వాటిని బినామి పేర్లు పైకి మార్చడం జరిగిందని ఆరోపించారు. మదనపల్లి బైపాస్ రోడ్డులో కోట్లు విలువైన ఇరిగేషన్ చెక్ డ్యాం ద్వంసం చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుమీదకు మార్చడంలో కొందరు వ్యక్తులు కీలకపాత్ర పోషించారని అన్నారు. పెద్దిరెడ్డి బినామి మాధవరెడ్డి ఇంటిలో మూడు సంచులలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని, ఇంక ఇలాంటివి ఎన్ని, ఎక్కడ వున్నాయో అని ప్రశ్నించారు. సిటిఎం ప్రాంతానికి చెందిన మంత్రి అనుచరుడు, పిఏ గా చలామణి అవుతున్న వ్వవసాయాధారిత, మున్సిపాలిటీలో కీలక స్థానంలో ఉన్న వ్వక్తి, మదనపల్లి ప్రాంతంలో భూముల గుర్తింపు, వాటి బదలాయింపులో లోతైన పాత్ర వుందని, సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. పుంగనూరు ప్రాంతంలో రెండు వేల ఎకరాలు, మదనపల్లి నియోజకవర్గంలో వెయ్యి ఎకరాలు పెద్దిరెడ్డి, వారి అనుచరుల ఆధీనం వున్నాయని ఆరోపించారు. పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి అప్పటి పోరాటంతో వైసిపి వారి కబ్జాల నుండి కాపాడటం జరిగిందని అన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం కీలక పాత్రపైన సమగ్ర దర్యాప్తు అవసరం అన్నారు. పాల్గొన్నారు.