contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కార్యకర్తలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా భరోసానివ్వాలి : ఆర్.జె.వెంకటేష్

  • టిడిపి కార్యకర్తలకు శాసనసభ్యులు భరోసానివ్వాలి
  • టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్ వెల్లడి

 

మదనపల్లి : ఎమ్మెల్యే ఆదేశాలను నియోజకవర్గంలో అధికారులు పాటించి తీరాల్సిందేనని టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జె.వెంకటేష్ వెల్లడించారు.బుధవారం నిమ్మనపల్లి సర్కిల్ నందు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు ఏవైనా అవసరాల కోసం అధికారులను సంప్రదిస్తే పనులు జరగడం లేదని,దీంతో ఎమ్మెల్యే సిఫారసు చేయవలసి వస్తుందన్నారు.కావున అనుకూలమైన అధికారులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అయితే మంచి అధికారులు నియమించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించినప్పటికీ ఉన్నతాధికారులు వాటిని పాటించలేదన్నారు.నిమ్మనపల్లి డిటిని బదిలీ చేయగా,తిరిగి అయినను నియమించాలని కోరగా,ఎమ్మెల్యే స్పందించారని అయితే సబ్ కలెక్టర్ జాప్యం చేయడం  జరిగిందన్నారు. కార్యకర్తల ప్రతి చిన్న సమస్యకు అటు ఎమ్మెల్యే,ఇటు ముఖ్య నాయకులు ప్రతిసారి స్పందించాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు.అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు పూర్తయిన టిడిపి కార్యకర్తలు ఎమ్మెల్యేని స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు.అధిక సంఖ్యలో ప్రజలు సమస్యలతో రావడం,ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఈ సమస్య తలెత్తుంతోందన్నారు దీంతో అటు నాయకులు,ఇటు కార్యకర్తలలో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కార్యకర్తల సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం కేటాయించాలని అభిప్రాయపడ్డాడు.అటు ప్రజా సమస్యలకు ఇటు పార్టీ నాయకుల,కార్యకర్తలకు ఎమ్మెల్యే సమన్యాయం చేయాలన్నారు.పరిపాలనలో టిడిపి కార్యకర్తలు భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారని,ఇది జరగాలంటే నియోజకవర్గంలో ని అన్నిశాఖలలో అనుకూలమైన అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,తద్వారా కార్యకర్తలకు భరోసానివ్వాలని ఆర్.జె.వెంకటేష్ స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :