మదనపల్లి :అభివృద్ధి సంక్షేమ పాలన ఓర్వలేక జగన్ విమర్శలు చేస్తున్నారని టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి అర్జె వెంకటేష్ ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తల్లి చెల్లి కూడ జగన్ మాటలను నేడు నమ్మే పరిస్థితి లేదన్నారు. అనాడు జగన్ మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు శాపం, పాపం గా మారిందని నిప్పులు చేరిగారు. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచుతున్నాదనే ఆరోపణల్లో ఏంత మాత్రం నిజం లేదని ఖండించారు. గతంలో వైకాపా ప్రభుత్వం లో 9 సార్లు కరెంట్ ఛార్జిలు పెంచారని విమర్శలు గుప్పించారు. అదే టిడిపి పాలన లో ఒక్క సారి కూడ విద్యుత్ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. కేవలం కమిషన్లు కు కక్కుర్తి పడి ఆనాడు వైకాపా ప్రభుత్వం రాబోవు ఏళ్ళ కు కరెంట్ కొనుగోళ్ళ కు అగ్రిమెంట్ లు చేసుకొన్నారని గుర్తు చేశారు. ఇందుకు మద్యం ద్వారా వచ్చే అదాయానికి తీసుకొన్న నిర్ణయాలే నిదర్శనం అన్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాలు రాష్ట్రాన్ని 25 ఏళ్ళు వెనక్కి నెట్టేశారన్నారు. రాష్ట్రంలో రాష్ట్రంలో నేడు అభివృద్ధి కార్యక్రమాలు సరవేగంగా కొనసాగు తున్నాయిని విమర్శించారు. ఓవైపు రోడ్ల నిర్మాణాలు, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని మార్చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయిని కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగిందని అంతేకాకుండా దేశానికే దిక్సూచిగా అమరావతి నిర్మాణ పనులు జరుగు తున్నాయన్నారు. రాష్ట్ర రాజధానిని కేంద్రంలోని రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం చేసేందుకు జరుగుతున్న పనులే నిదర్శనం అన్నారు.