మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవిస్తూ ఎస్సి వర్గీకరణనను వెంటనే అమలు చేయాలని దండోరా కమిటీ నాయకులు స్థానిక మీడియా సమావేశంలో కోరారు . ఎమ్మార్పీఎస్ దండోరా కమిటీ 30 సంవత్సరాలుగా ఎబిసిడి వర్గీకరణ కోసం చేసిన పోరాటం ఫలించిందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు యాదగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు విజయ్ కుమార్, ముక్క యాదగిరి, దశరథ శంకర్, ఎర్ర స్వామిఎం, గుడ్డి రమేష్, గుడ్డి విటల్, గౌరగల రామస్వామి, ఎర్ర సాయికుమార్, గౌడగల రాములు తదితరులు పాల్గొన్నారు.