- పాఠశాలలో అంగన్వాడీలో పరిశుభ్రత పాటించాలి
- గ్రామంలో ఎలాంటి చెత్తచెదారం పిచ్చి మొక్కలు ఉండకూడదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం మంగళవారం నాడు మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలోని తహసిల్దార్ జ్ఞాన జ్యోతి స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలను పరిశీలించారు. పలు కాలనీలో తనిఖీలు నిర్వహించారు. కాలనీలలో రోడ్లు శుభ్రంగా ఉండాలని, గల్లీలలో మురికి కాలువలో చెత్తాచెదారంతో మట్టితో నిండిపోవడంతో నీరు వెళ్లలేక అక్కడే నిలిచిపోయి ఉండడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.