మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండాలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన వైద్య బృందం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు సబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, నీటి తొట్లలో మురికి నీరు లేకుండా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ రేణుక, ఆశా వర్కర్లు రేణుక, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ సిబ్బంది అంజమ్మ తదితరులు పాల్గొన్నారు