మెదక్ జిల్లా : మత్తు పదార్థాల రవాణా ను అరికట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ .. మత్తు పదార్థాల రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి, కళాశాలల యువత పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించారు.
యువత తెలిసి తెలియక మత్తుకు బానిసై భవిష్యత్తు ను నాశనంచేసుకోవద్దని, డ్రగ్స్ , కొకైన్ , గంజాయి లాంటి మత్తు పదార్థాల వల్ల చాలా అనర్ధాలని తెలిపారు. తల్లి తండ్రుల కూడా పిల్లల ప్రవర్తన ను తెలుసుకోవాలని, పిల్లల ప్రవర్తన లో మార్పు అనిపిస్తే పోలీస్ శాఖ వారిని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, జెడ్ పి, సీఈఓ ఎల్లయ్య, డీఈవో రాధా కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు ,ఎక్సైజ్ అధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.