మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురికి అండగా ఉండాల్సిన తండి దారుణానికి ఒడిగట్టాడు. సిఐ రంగాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం శేరీల గ్రామానికి చెందిన ఇక్కిరి శ్రీశైలం తన కూతురు నికిత (9) కి మే 31న కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తాగించాడు దీంతో అస్వస్థతకు గురైన నికిత ను హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నికిత జూన్ 3న ఉదయం మృతి చెందింది. చిన్నారి నికిత మృతికి కారణం .. శ్రీశైలం అని భార్య సౌందర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు పై పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్న క్రమంలో బుధవారం చేగుంట మండలం సమీపంలో బైక్ పై వెళ్తుండగా అదుపులోకి తీసుకొని విచారణ చేయగా కూతురు చదువులకు. పెద్దయ్యాక తన వివాహం చేయడం ఎలా అని ఆలోచనతో కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపినట్లు శ్రీశైలం ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు. మృతికి కారణమైన తండ్రిని పోలీసులు మెదక్ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.