మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మాసాయిపేట గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత నాయకులు జెండా ఎగరవేశారు. మూడు రోజులు బోనాల జాతర లో ప్రజలందరు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.