తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మాల మహానాడు బంద్ పిలుపును మాదిగలు ఖండించారు. 59 కులాలకు దక్కవలసిన 15% రిజర్వేషన్ లను మాలలు దోచుకొని అనుభవిస్తున్నారని, పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ, ఆర్థికంగా అందలమెక్కి, మిగతా కులాల వారిని అణగదొక్కడమే పనిగా పెట్టుకుని అణచివేతకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మాల మహానాడు ఇచ్చిన బంద్ కు ఫైలుపునివ్వడం ఎం ఈ ఎఫ్, ఐటీసీ మాదిగ ఉద్యోగులం తీవ్రరంగ ఖండిస్తున్నామన్నారు.