మెదక్ జిల్లా / తూప్రాన్ : నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగుతోంది. వారు విదిల్చే కాసుల కు ప్రభుత్వ అధికారులు కక్కుర్తి పడుతున్నారు. దీంతో మట్టిని అక్రమంగా తరలించే అక్రమార్కు లకు బ్రేకులు వేసేవారే కనిపించడం లేదు. మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ నాగులపల్లి వెల్దుర్తి రోడ్డు లో నాసాన్పల్లి బొమ్మరం గ్రామాల శివారులో ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వి తీసుకొని వెళుతున్నా రు. ఇటుకల బట్టీలలో వాడేందుకు రియల్‌ఎస్టేట్ వెంచర్లలో రోడ్లు వేసేందుకు ఈ మట్టి ఉపయోగ పడుతుండడంతో మట్టిని ఎక్కడ పడితే అక్కడ ఎక్సకవేటర్లతో తవ్వి ట్రాక్టర్లతో పెద్ద పెద్ద ట్రక్కులలో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటు న్నారు.
గత అయిదు రోజులనుండి పట్టపగలే అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పోలీసువారికి అందిన సమాచారం మేరకు అక్రమార్కుల వాహనాలను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.