మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ క్రింద పడి తండ్రి కొడుకు దుర్మరణం చెందారు. కామారెడ్డి వైపు నుండి హైదరాబాద్ వైపు వస్తున్న లారీ ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులపై నుండి లారీ వెళ్ళింది. ఈలో చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన దొంతు మల్లేశం అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రమాదంలో పడ్డాడు, అతని తండ్రి బూదయ్య లారి క్రింద పడి రెండు ముక్కలయ్యాడు. ఈ హృదయ విదారకమైన ప్రమాద ఘటన చూపరులను కంటతడి పెట్టించింది. రెండు ముక్కలై కొన ఊపిరితో ఉన్న తండ్రి భూధయ్యను స్థానికులు తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ సోమ వెంకట్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిగింది. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడికి భార్య, మూడు సంవత్సరాల లోపు కూతురు ఉన్నారు. కుటుంబంలో ఇద్దరు మగవాళ్ళు చనిపోవడంతో కుటింబికులు శోకసముద్రంలో మునిగిపోయారు