మెదక్ జిల్లా / నిజాంపేట : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేస్తున్నామని మెదక్ ఆర్డిఓ రమాదేవి తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆర్డిఓ రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల చుట్టూ పరిసరాలను ఆమె పరిశీలించారు. విద్యార్థుల కు అందుతున్న భోజనాన్ని ఆమె పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం లో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజన అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్టు ఆమె తెలిపారు.