- మహిళా భక్తుల కోలాటం దాండియా నృత్యాలు
- భారీ భక్త జన సందోహం మధ్య శివ శివాని పంక్షన్ హాల్ నుంచి పెద్ద చెరువు వరకు ఊరేగింపు
మెదక్ జిల్లా తూప్రాన్ : తూప్రాన్ పట్టణంలో శివాలయం వెనుక శివ శివాని పంక్షన్ హాల్ వద్ద మహా సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జనోత్సవ శోభాయాత్ర ఘనంగా అత్యంత వైభవంగా కనుల పండువగా సాగింది. ఆద్యంతం ఆసక్తికరంగా కడు రమణీయంగా ఊరేగించారు. తొమ్మిది రోజుల పాటు వినాయక నవరాత్రులు నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం సాయంత్రం తూప్రాన్ లోని శివ శివాని పంక్షన్ హాల్ వద్ద మహిళా భక్తులు పాల్గొని భక్తి ప్రపత్తులతో దాండియా నృత్యాలు చేస్తూ కోలాటం ఆడారు. యువత కేరింతల మధ్య శివాలయం నుండి మున్సిపల్ ఆఫీసు గుండా ప్రధాన రహదారి పై సుమారు కిలోమీటరు మేర శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. లడ్డూ వేలం పాట ద్వార 36 వేలకు కనకరాజు అనే భక్తుడు పాట పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో శివ శివాని పంక్షన్ హాల్ అధినేత జానకిరామ్ సిఆర్, హర్షవర్ధన్ గౌడ్, చింతల రవీందర్ గౌడ్, మాధవ రెడ్డి, మక్కల రాములు సెట్, లక్ష్మణచారి, దుర్గ ప్రసాద్, ప్రవీణ్, ప్రశాంత్, ప్రతాప్ గౌడ్, కొండల్, మహా సేన యూత్ అసోసియేషన్ నాయకులు కర్ణం వినయ్ కుమార్, యశ్వంత్, శ్రవణ్, శ్రీహరి, రాహుల్, వేణు, వికాస్, గణపతి, వంశీ , సాయితేజ, కార్తీక్, స్వామి మరియు భక్తులు పాల్గొన్నారు.