- వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గణేష్ బందోబస్తు లో పాల్గొన్న జిల్లా పోలీసు సిబ్బందికి అభినందనలు:
- జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ,ఐపిఎస్
- జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం
- వరుస నిమజ్జనాలతో వారం రోజులుగా కంటి మీద కునుకు లేని జిల్లా పోలీసులు
- ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి
- క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన సిబ్బందికి అభినందించినలు తెలిపిన ఎస్పీ
- గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపన, నిమజ్జనం మరియు మిలాద్ ఉన్ నబీ పండుగల నిర్వాహణకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు
మెదక్ పోలీస్ కార్యాలయం : ఈనెల 7వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ శాఖలు అయన విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ తెలిపారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. జిల్లా పరిధిలో గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నవరాత్రి ఉత్సవాలు మరియు మిలాద్ ఉన్ నబీ పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం జరిగిందని ప్రతిష్ఠాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9 మరియు 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయడం జరిగింది. గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే తేది: 16-9-2024 నా మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఉత్సవ వేడుకల ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేయడం జరిగింది. నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి అన్ని వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన నిమజ్జనం మరియు మిలాద్ ఉన్ నబీ వేడుకలు అన్నింటికి గణేష్ మండలి లు మజీద్ కమిటీలు, విగ్రహ గణేష్ కమిటీలు మరియు అన్ని మతాల ప్రజలు, ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించడం జరిగింది. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ గ్రామ పంచాయతి, మున్సిపాలటి, అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్ మరియు ఎన్.సి.సి మరియు గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించడం జరిగింది. అలాగే పత్రిక ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా / ప్రింట్ మీడియా సిబ్బంది అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలుపుతున్నట్లు తెలియజేశారు. అలాగే రాబోయే పండుగలను కూడా అన్ని మతాలవారు పరస్పరం సహకరించుకుంటూ జరుపుకోవాలని కోరారు.