భారత ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వ కోరిన మేరకు హైదరాబాద్ నగరము చుట్టూ ప్రాంతీయ వలయ రహదారి నిర్మాణం చేయుటకు నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వం ఆధినములో గల జాతీయ రహదారుల నిర్మాణం ప్రాదికారిక సంస్థ, N.H.A. హైదరబాద్ నగరానికి ఉత్తర భాగమున సుమారు 158 K.M (H.R.R.R) నిర్మాణము చేయటకు గాను, సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు గల రహదారి లో తూప్రాన్, డివిజన్ పరిధిలో గల తూప్రాన్ మండలం లోని వట్టుర్, (32.37 ఎకరాలు) నాగులపల్లి, (116.00 ఎకరాలు) ఇస్లాంపూర్, (100.00 ఎకరాలు) దాతార్పల్లి, (1.30 ఎకరాలు) గుండెరెడ్డిపల్లి, (57.30 ఎకరాలు) కిస్టాపూర్, (0.13 ఎకరాలు) వెంకటయపల్లి, (42.30 ఎకరాలు) మరియు నర్సంపల్లి, (73.28) గ్రామాల పరిదిలో గల హెక్టర్ల 176-616,( 436.20) ఎకరాలకు తేది 2.09.2022. రోజున కేంద్ర ప్రభుత్వం 3.A Gazette Notification జారీ చేసింది. దీని ప్రకారం భుసేకరణ చేయుటకు ఆదేశాలు జారీ చేయబడినవి.
అందులో భాగంగా, సుమారు (133.42) హెక్టర్ల అనగా 329.54 ఎకరాల భూమికి 3.D తేది 08.08.2023. రోజున భారత ప్రభత్వం తరుపున N.H.A.I. Gazette Notification జారి చేసింది. దీని ప్రకారం భూ నిర్వసితులకు చేల్లింపు చేయుటకు రాష్ట ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము మధ్యన సంప్రదింపులు జరిగి మార్కెట్ విలువ నిర్ధారణ అయిన తరువాత, రైతులకు పరిహారము చెల్లింపులు జరుగును. ఆ తరువాత 38.04 హెక్టర్ల అనగా 93.95 ఎకరాలు అదే రేటు ప్రకారము చేల్లింపులు జరుగును. ఈ ప్రక్రియ జరుగుటకు రెండు లేద మూడు నెలల సమయము పట్టవచ్చును. మిగిలిన 6.716 హెక్టర్ల అనగా 16.588 ఎకారాలు లో 3.8 హెక్టర్ల అనగా 9.38 ఎకారాలు భూమికి అదనపు 3.A ప్రకటన గురించి P.D N.H.A.I (PIU) గజ్వేల్ కు ప్రతిపాదనలు పంపడం జరిగింది. మిగిలిన భూమి 2.9 హెక్టర్ల అనగా 7.163 ఎకారాలు ఏజెన్సీ ద్వారా సర్వే చేసిన తరువాత భూ సేకరణ చేయబడును. రెవెన్యూ అధికారులు తెలిపారు