- ప్రజలందరికీ సమాన న్యాయం , సామరస్యం చాలా అవసరం .. కలెక్టర్ రాహుల్ రాజ్
- రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారం దేశంలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవించి, ఇష్టమైన వృత్తినైనా చేపట్టవచ్చు ..
- ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
- రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను కాల రాస్తే చట్ట వ్యతిరేక పనులకు పూనుకుంటే సహించేది లేదు .. ఎస్పీ ఉదయ్ కుమార్
మెదక్ జిల్లా మనోరాబాద్ : మనోహరాబాద్ మండలం గౌతాజిగూడ గ్రామంలో దళిత కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసారు. ఉన్నత చదువులు చదువుకుని ఉస్మానియా లో ఉద్యోగం చేస్తున్న యువకుడు డబ్బు కొట్టాలని కొద్దిరోజులుగా ఆ కుటుంబాన్ని హింసిస్తూ , డప్పు కొట్టలేదని కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసారు. ఈ విషయం పై రాష్ట్ర హైకోర్టు లో సీనియర్ న్యాయవాది రఘునాధ్ గట్టిగా వాదనలు వినిపించారు. ఈ విషయం హైకోర్టు ఘాటుగా స్పందించి కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పి ఉదయ్ కుమార్ బాద్యులను చేస్తూ గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఉండాలని , వారి హక్కులకు భంగం కలగకుండా చూడాలన్నారు. దీంతో నేడు గ్రామంలో జిల్లా కలెక్టర్ , ఎస్పీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసారు.
వారు మాట్లాడుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా గ్రామా ప్రజలు చూసుకోవాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇటువంటి చర్యలకు పాలుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీవో జై చంద్రారెడ్డి, సంబంధిత ఇతర శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.