మెదక్ జిల్లా: మాసాయిపేట పట్టణంలో, స్పెషల్ అధికారి తహసిల్దార్ జ్ఞాన జ్యోతి ఆధ్వర్యంలో మాసాయిపేట చావడి దగ్గర గ్రామసభ నిర్వహించబడింది. ఈ సమావేశంలో గ్రామంలో ఉన్న వివిధ సమస్యలు చర్చకు వచ్చినాయి. గ్రామ పంచాయతీకి అవసరమైన నిధుల కోసం అధికారులు సక్రమంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపిటిసి చెరుకు సిద్ధరాములు గౌడ్, మాసాయిపేట మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు మరియు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.