మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్ లో మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం పాలుపడ్డారు. ఎస్సై మానసికంగా వేధిస్తున్నాడని, విధులుకు హాజరైనాకానీ కాలేదని ఆబ్సెంట్ వేయిస్తున్నాడని ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తుంది.
ఈ విషయం పై పలుమార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని, రోజురాజుకి వేధింపులు ఎక్కువవుతున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది. ఈ విష్యం పై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.