- నమ్మదగిన సమాచారంతో దాడులు చేసిన ఎక్సైజ్ పోలీసులు
- 12 గంజాయి మొక్కలు స్వాధీనం
- రైతు పై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ సిఐ రాణి
- తహసిల్దార్ ఎదుట బైండోవర్…
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి మండలంలో సోమవారం అనుమానాస్పద పద్ధతిలో రైతు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు అందిన సమాచారంతో రామాయంపేట ఎక్సైజ్ సీఐ రాణి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించబడ్డాయి. ఈ దాడి ఆధారంగా, శెట్టిపల్లి గ్రామానికి చెందిన ఎలబోయిన బూదయ్య అనే రైతు తన వ్యవసాయ పొలంలో గంజాయి మొక్కలు నాటడం వెలుగులోకి వచ్చింది.
సీఐ రాణి తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సై విజయ్ సిద్ధార్థ మరియు సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించినప్పుడు 12 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోబడినట్టు చెప్పారు. అందులో ఆరు మొక్కల ఎత్తు సుమారు 6 ఫీట్లు కాగా, మిగిలిన ఆరు మొక్కలు సుమారు 3 ఫీట్లు ఉన్నాయని తెలిపారు.
పంచనామ నిర్వహించి సంబంధిత రైతుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాణి పేర్కొన్నారు. రైతును వెల్దుర్తి తహసిల్దార్ కృష్ణ ఎదుట బైండవర్ చేయగా, మత్తు పదార్థాలకు యువత బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆమె సూచించారు.