మాసాయిపేట : మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం ధన్వంతరి ఆయుర్వేద వైద్యుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆయుర్వేద డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా, మండల కేంద్రంలోని వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, “ఆయుర్వేదం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఔషధ ప్రక్రియ. ధన్వంతరి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆయుర్వేద క్యాంపులు నిర్వహించేందుకు ఆదేశాలు వచ్చాయి. మాసాయిపేట మండల కేంద్రంలో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది,” అని తెలిపారు.
ఆయుర్వేదాన్ని సృష్టి మొదటి రోజుల నుండి ఉపయోగిస్తున్నామని, కాలక్రమంలో దీనిని ఉపయోగించడం తగ్గిపోయిందని ఆమె గుర్తు చేశారు. “ఆయుర్వేదాన్ని వాడడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని, అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనది,” అని డాక్టర్ శ్రీదేవి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్య సిబ్బంది పాల్గొన్నారు.