contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Mekda: పోలీసులకు సవాల్ గా మారిని వరస హత్యలు

మెదక్ జిల్లాలో వరుస హత్యలు పోలీసులకు సవాల్ గా మారింది. తొమ్మిది రోజుల వ్యవధిలో రెండు ఒకే తరహా హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి . మెదక్ జిల్లా చిన్న శంకరంపేట కేంద్రంలో ఆదివారం స్థానిక చేగుంట రోడ్డు పద్మనాభ స్వామి దేవాలయం వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాండ్ లో గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేశారు గుర్తుతెలియని దుండగులు. ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు .. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే గత 24వ తేదీన స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇదే తరహాలో గుర్తుతెలియని వ్యక్తిని బండరాయితో కొట్టి హత్య చేసిన అనంతరం పెట్రోల్ పోసి దహనం చేశారు.. ఆ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయనప్పటికీ ఈరోజు అదే తరహాలో మరో హత్య జరగడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు హత్యకు గురవుతున్నట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. పది రోజుల క్రితం జరిగిన హత్య కేసులో కూడా మృతుడు ఎవరు అనేది తెలియలేదు.. ఈరోజు హత్యకు గురైన మృతుడు కూడా ఎవరు అనేది తెలియలేదు. ఒకే తరహాలో హత్యలు జరగడంపై స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు, సంఘటన స్థలానికి మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, తూప్రాన్ డిఎస్పి వెంకటరెడ్డి, రామయంపేట సే వెంకటరాజా గౌడ్, స్థానిక ఎస్సై నారాయణ గౌడ్లు చేరుకొని విచారణ చేపట్టారు క్లూస్ టీం ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరగడమే విషయాన్ని డాగ్ స్క్వాడ్ ఆధారంగా హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు అనంతరం మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పది రోజుల క్రితం జరిగిన హత్యకు సంబంధించిన వ్యక్తి కూడా ఎవరు అనేది తెలియలేదని సీసీ ఫుటేజ్ ల ఆధారంగా ఆధారాలు సేకరిస్తున్నామని, గతంలో జరిగిన హత్య ఈ హత్య ఒకరే చేసినట్టుగా అనుమానం ఉన్నట్టు ఆయన తెలిపారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :