తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన మెదక్ ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, అండర్ 17, అండర్ 19 బాల బాలికల రగ్బీ పోటీలకు మెదక్ ఉమ్మడి జిల్లా నుండి 350 మంది క్రీడాకారిణులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచిన 36 మంది బాలికలు మరియు 36 మంది బాలురను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కోచ్ కరణం గణేష్ రవికుమార్, మెదక్ జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి రమేష్, జిల్లా పీ.ఈ.టి ల సంఘం అధ్యక్షుడు నాగరాజు మరియు సెలక్షన్ కమిటీ ఇన్చార్జ్ శారద వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి పాల్గొని క్రీడాకారులు ప్రతినిత్యం శ్రద్ధతో ప్రాక్టీస్ చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు సాధించి, చదువుకునే స్కూల్ కి, కాలేజీకి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అలాగే క్రీడల వల్ల రెండు శాతం కోటతో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి, ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లీశ్వరి, సిద్ధిపేట జిల్లా ఇంచార్జ్ అధ్యక్షులు భరత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అజయ్, మరియు రగ్బీ రెఫరీలు నవీన్, మహేష్, శ్రీనాథ్, పీ.ఈ.టి లు నరేష్, ప్రవీణ్, శేఖర్, శంకర్, నర్సింలు, సరితా, మంజుల, ప్రభు, చింటూ తదితరులు పాల్గొన్నారు.